ఇండియా, విండీస్​కు జరిమానా

దుబాయ్‌‌: తొలి టీ20లో స్లో ఓవర్‌‌ రేట్‌‌ నమోదు చేసిన ఇండియా, వెస్టిండీస్‌‌ జట్లకు జరిమానా పడింది. నిర్ణీత టైమ్‌‌లోగా ఇండియా ఒక ఓవర్‌‌ తక్కువగా వేయడంతో ప్లేయర్ల మ్యాచ్‌‌ ఫీజులో 5 శాతం కోత విధించారు. రెండు ఓవర్లు తక్కువగా వేసిన విండీస్‌‌కు10 శాతం ఫైన్‌‌ వేశారు. ఐసీసీ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌లోని ఆర్టికల్‌‌ 2.22 ప్రకారం చర్యలు తీసుకు న్నట్లు మ్యాచ్‌‌ రిఫరీ రీచీ రిచర్డ్‌‌సన్‌‌ వెల్లడించాడు. ఇరుజట్ల కెప్టెన్లు హార్దిక్‌‌ పాండ్యా, పావెల్‌‌ తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేదని చెప్పాడు.