IPL 2025 SRH: నాలుగో ప్లేయర్ ఎవరు..? ఓవర్సీస్ క్రికెటర్‌పై సన్ రైజర్స్ గందరగోళం

IPL 2025 SRH: నాలుగో ప్లేయర్ ఎవరు..? ఓవర్సీస్ క్రికెటర్‌పై సన్ రైజర్స్ గందరగోళం

ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత పటిష్టంగా మారింది. ఇషాన్ కిషాన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ లాంటి ఆటలు చేరడంతో ఈ సారి టైటిల్ ఫేవరేట్స్ జట్లలో ఒకటిగా నిలిచింది. కమ్మిన్స్ కెప్టెన్సీలో సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్(SRH) తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఆడనుంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 23 న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ ఎలాంటి విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందనే విషయంలో ఆసక్తి నెలకొంది. 

కెప్టెన్ కమ్మిన్స్ తో టాప్ ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ తుది జట్టులో ఉండడం ఖాయమైంది. ఈ ముగ్గురినీ ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్ కు అత్యధికంగా రూ. 23 కోట్లు (దక్షిణాఫ్రికా, బ్యాటర్/ వికెట్ కీపర్) పాట్ కమిన్స్ కు (కెప్టెన్, ఆస్ట్రేలియా బౌలర్) రూ.18 కోట్లు, ట్రావిస్ హెడ్ కు రూ.14 కోట్లు (ఆస్ట్రేలియా బ్యాటర్) ఇచ్చి రిటైన్ చేసుకుంది. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు విఫలమైనా టోర్నీ మొత్తం తుది జట్టులో ఉండడం దాదయో ఖాయంగా కనిపిస్తుంది. ఇక నాలుగో ఫారెన్ ప్లేయర్ ఎవరనే విషయంలో గందరగోళం మొదలైంది. 

Also Read : నలుగురు అంతర్జాతీయ సారధులకు కెప్టెన్‌గా పాండ్య

సన్ రైజర్స్ ఈ సీజన్ లో మొత్తం 7 గురు ఫారెన్ ప్లేయర్లతో ఆడుతుంది. కమ్మిన్స్, క్లాసన్, హెడ్ తో పాటు ఆడమ్ జంపా (రూ.2.4 కోట్లు, ఆస్ట్రేలియా స్పిన్నర్),ఎషాన్ మలింగ (రూ.1.2 కోట్లు శ్రీలంక బౌలర్), కమిందు మెండిస్ (రూ.75 లక్షలు శ్రీలంక ఆల్ రౌండర్), వియాన్ ముల్డర్ (రూ. 75 లక్షలు, సౌతాఫ్రికా ఆల్ రౌండ) హైదరాబాద్ జట్టులో చేరారు. ఈ నలుగురిలో ఒక్కరికే తుది జట్టులో స్థానం దక్కనుంది. 

రాహుల్ చాహర్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండడంతో జంపా బెంచ్ కే పరిమితం కావొచ్చు. బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉండడంతో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండీస్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కష్టంగానే కమిపిస్తుంది. హర్షల్ పటేల్,మహ్మద్ షమీ,పాట్ కమిన్స్,జయదేవ్ ఉనద్కత్ లాంటి దుర్బేధ్యమైన పఫాస్ట్ బౌలర్లు ఉండడంతో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఆల్ రౌండర్ విభాగంలో జట్టు బలహీనంగా కనిపిస్తుంది. లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయడానికి ఒక బ్యాటర్ కావాలి. దీంతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ముల్డర్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.