
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు. పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్‌పూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. మంథని మండలం సూరయ్యపల్లిలో లీడర్లు రావుల నాగేష్, నక్క తిరుపతి, గోటికార్కిషన్ జీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు.