అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు

అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు

ప్రాపంచిక సుఖాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని 30ఏళ్ల ఓ తల్లి,  ఆమె 11ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నారు. దీంతో వారు కోట్ల వ్యాపారాన్ని, లగ్జరీ లైఫ్ ను వదిలి జైనమత సన్యసం తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం జైన సమాజంలో సన్యాసాన్ని స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. స్వీటీ పేరు మార్చుకొని భవశుధి రేఖ శ్రీ జీగా, ఆమె 11 ఏళ్ల కుమారుడు హితాశయ్ పేరు మార్చుకొని రతనవిజయ్ జీగా జైనమత సన్యాసం తీసుకున్నారు. 

స్వీటీ గర్భవతిగా ఉన్నప్పుడే సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుందట ఆ విషయాన్ని ఆమె భర్త మనీష్ కూడా స్వాగతించాడు. 2024 జనవరిలో గుజరాత్ లోని సూరత్ లో తల్లి,కొడుకు దీక్షా కార్యక్రమం చేపట్టారు. వీరిరువురూ సూరత్ లో నివాసం ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక అభివృద్ధి, జ్ఞానోదయం కోసం వారి ప్రయాణం ప్రారంభించారు.