లాక్డౌన్ వేళ రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల రోడ్లన్ని ఖాళీగా ఉండటంతో వాహనాల స్పీడుకు అడ్డులేకుండా పోయింది. జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు.. అయిలయ్య, వెంకటమ్మలను ఢీకొట్టింది. అయిలయ్య కర్ర పట్టుకొని నడుస్తుండగా.. వెంకటమ్మ అయిలయ్యను చేతితో పట్టుకొని రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. అంతలోనే వేగంగా వచ్చిన కారు.. వారిని ఢీకొట్టడంతో అమాంతం ఎగిరి దూరంగా పడ్డారు. తీవ్ర గాయాలైన వారిరువురు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య జరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తుంది. ఆ ఫుటేజీలో కారు ఎంత వేగంగా వెళ్తుందో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదానికి కారణమైన కారు జాడ ఇంకా తెలియలేదు. సీసీ ఫుటేజీ ద్వారా కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

For More News..

పట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం

ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు