
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం వెండికోల్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి భార్యభర్తలిద్దరూ చనిపోయారు. గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తోటమాలిగా పనిచేస్తున్న శ్రీనివాస్ (46) తోటకు నీరు పెట్టేందుకు బోరు మోటర్ ఆన్ చేయగా అతనికి కరెంట్ షాక్ తగలింది. అతడు కేకలు వేయడంతో గమనించిన భార్య దేవి అతనిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇద్దరికీ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..