నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాలవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అటవి ప్రాంతంలో భార్య భర్తలు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు సారంగాపూర్ మండలం చించోలి బి.గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి అనసూయ దంపతులుగా గుర్తించారు. అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు