అనారోగ్యంతో గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి

అనారోగ్యంతో గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి

వనపర్తి, వెలుగు : భార్య మృతి చెందిన గంటల వ్యవధిలోనే భర్త సైతం చనిపోయాడు. ఈ ఘటన వనపర్తి పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన ఎల్లమ్మ (65), దావీదు (70) భార్యాభర్తలు. ఎల్లమ్మ శనివారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దావీదుకు భార్య చనిపోయిన విషయాన్ని చెప్పలేదు. ఆదివారం ఉదయం దావీదు పరిస్థితి సీరియస్‌‌‌‌‌‌‌‌గా మారడంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా అతడు కూడా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. గంటల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.