ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. రోజు మద్యం సేవించి విసిగిస్తున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పరిధిలోని నానాజీపూర్ గ్రామంలో రాజు (40) అతని భార్య జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసైనా రాజు నిత్యం తాగి వచ్చి తన భార్య జ్యోతిని వేధించేవాడు.
అయితే నిన్న మద్యం సేవించి వచ్చిన రాజు తన భార్య జ్యోతిని కొట్టడంతో ఆవేశానికి లోనైనా ఆమె కత్తితో రాజుపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో రాజు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.