పురుగుల మందు తాగి భార్య..యాక్సిడెంట్‌‌లో భర్త మృతి

  • మంచిర్యాల జిల్లా ఎల్లారంలో విషాదం 

లక్షెట్టిపేట, వెలుగు: భార్య చనిపోయిన కొన్ని గంట లకే భర్త యాక్సిడెంట్‌‌లో చనిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్(31), శరణ్య(28) దంపతులకు ఓ బాబు (7), పాప (5) ఉన్నారు. ఈ నెల 14న శరణ్యకు ఇంటి పక్కనుండే మహిళతో గొడవ జరిగింది. దీంతో సదరు మహిళ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చే సింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శరణ్య.. అదే రోజు పురుగుల మందు తాగింది. కరీంనగర్‌‌‌‌ హాస్పిటల్‌‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది.

ALSO READ :బడినిట్ల బాగు చేయొచ్చు 

ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా, దాని వెనకాలే భర్త మల్లికార్జున్ బైక్‌‌పై వస్తున్నాడు. కరీంనగర్ చౌరస్తాకు అంబులెన్స్‌‌ చేరుకోగానే, మల్లికార్జున్ టాయిలెట్‌‌ కోసం రోడ్డు దాటుతుండగా, అటుగా వచ్చి వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.