జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లుగా నిలిచి గెలిచిన భార్యభర్తలు

జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లుగా నిలిచి గెలిచిన భార్యభర్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దంపతులిద్దరూ కార్పొరేటర్లుగా గెలుపొందారు. వీరిద్దరూ టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొంది తమ బలాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ నుంచి జగదీశ్వర్ గౌడ్ మూడోసారి పోటీచేసి గెలుపొందారు. ఆయన భార్య పూజిత హఫీజ్ పేట డివిజన్ నుంచి రెండోసారి పోటీచేసి గెలుపొందారు. దాంతో భార్యభర్తలిద్దరూ కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్.. బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణయాదవ్‌పై 6905 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక హఫీజ్ పేట నుంచి పోటీచేసిన పూజిత.. బీజేపీ అభ్యర్థి అనూషా యాదవ్‌పై 5189 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పూజిత హఫీజ్ పేట నుంచి గెలవడం ఇది రెండోసారి కాగా.. జగదీశ్వర్ గౌడ్ మూడుసార్లు మాదాపూర్ నుంచి గెలుపొందారు. అయితే జగదీశ్వర్ గౌడ్ మొదటిసారిగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి రెండుసార్లు గెలుపొందారు.

For More News..

మధ్యప్రదేశ్‌లో మార్చి 31 వరకు స్కూల్స్ బంద్

స్వీపర్లు లేక టీచర్లే స్కూల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నరు

కేకే బిడ్డ గెలిచింది.. సుభాష్‌ రెడ్డి భార్య ఓడింది