ఘోరం: భర్తను చంపిన భార్య

ఘోరం: భర్తను చంపిన భార్య
  • అనుమానిస్తూ వేధిస్తున్నాడని భర్త హత్య
  • గొంతునులిమి చంపిన భార్య 
  • సహకరించిన తల్లి, ఆమె ప్రియుడు

జీడిమెట్ల, వెలుగు: గత నెల 22న హైదరాబాద్ దూలపల్లిలోని సెయింట్​మార్టిన్​ కాలేజీ వద్ద దొరికిన గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తనను అనుమానిస్తూ వేధిస్తున్నాడనే కారణంతో భర్తను భార్యనే హత్య చేసినట్టు గుర్తించా రు. ఈ కేసు వివరాలను పేట్​బషీరాబాద్​ఏసీపీ రాములు సోమవారం వెల్లడించారు. 

బాలానగర్​పరిధిలోని చింతల్​మాణిక్యనగర్​కు చెందిన బత్తుల సంగీత (24), జైపాల్​దంపతులకు ఒక బిడ్డ ఉంది. జైపాల్​కుటుంబ కలహాలతో కొన్నేండ్ల కింద సూసైడ్​చేసుకున్నాడు. ఈ క్రమంలో సంగీతకు ప్రకాశం జిల్లా చెరుకూర్​గ్రామానికి చెందిన ముట్లూరి మార్క్​(26)తో పరిచయం ఏర్పడింది. దీంతో వాళ్లిద్దరూ 2019లో ఓ చర్చిలో పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. వీళ్లంతా మాణిక్యనగర్​లో సంగీత తల్లి లక్ష్మి ఇంట్లోనే ఉంటున్నారు. 

లక్ష్మి సూరారానికి చెందిన కాశీనాథ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో అతను ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. అయితే మద్యానికి బానిసైన మార్క్.. సంగీతను అనుమానిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత నెల 22న ఫుల్లుగా తాగొచ్చి గొడవ చేశాడు. దీంతో విసిగిపోయిన సంగీత.. భర్తను గొంతునులిమి చంపేసింది. దీనికి లక్ష్మి, కాశీనాథ్ సహకరించారు. అదేరోజు కాశీనాథ్ ఆటోలో మార్క్​శవాన్ని వేసుకుని దూలపల్లిలోని సెయింట్​మార్టిన్​కాలేజీ వద్ద పడేశాడు. 

పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, పోస్టుమార్టం​రిపోర్టులో హత్యగా తేలింది. దీంతో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయ గా అసలు విషయం బయటపడింది. పోలీసులు నింది తులు ముగ్గురిని అరెస్ట్​చేసి రిమాండ్​కి తరలించారు.