హైదరాబాద్: కుటుంబ కలహాలు పెనుభూతమయ్యాయి. దీంతో విచక్షణ కోల్పోయిన భార్య నిద్రిస్తున్న టైంలో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన నాగర్‌కర్నూల్‌జిల్లాలో చోటుచేసుకుంది. లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన భార్య ఎల్లమ్మ నిన్న రాత్రి భర్త రాములను గొడ్డలితో నరికి కిరాతంగా చంపింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.