
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్పార్లమెంట్అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి ఎంపీగా రఘునందన్‌రావును గెలిపించాలని ఆయన సతీమణి మాధవనేని మంజుల అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయినగర్, వెంకట్రావునగర్ కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంఓ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండే వీణ, సంగీత, ప్రవళిక, నాగరాజు, సుంకోజు రాజు తదితరులు పాల్గొన్నారు.