భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం

భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం

హైదరాబాద్: ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను భార్య అడ్డుకుంది. ఈ  విషాద సంఘటన మంథనిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్, సంధ్య భార్యాభర్తలు. హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏడాది నుంచి సునీల్​, సంధ్యల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసైన సునీల్,  మూడు రోజుల క్రితం హైదరాబాద్లో అనారోగ్యంతో చనిపోయాడు. సునీల్​ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి  డెడ్​బాడీని  సొంతూరుకు  తీసుకువచ్చారు.

ALSO READ | అమ్మా.. గంగమ్మ తల్లి శాంతించు: హుస్సేన్​ సాగర్​ లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ పూజలు

అతని భార్య సంధ్య మంథనికి వచ్చి సునీల్ అంత్యక్రియలు  కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కొడుకు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆస్తి వ్యవహారాల గొడవలతో దహన సంస్కారాలను అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చ చెప్పిన సంధ్య, ఆమె కుటుంబ సభ్యులు వినలేదు. సుమారు రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డున సునీల్  డెడ్​బాడీతో వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం వేచి చూశారు. చివరకు ఇవాళ తెల్లవారుజామున పెద్దమనుషులు నచ్చజెప్పడంతో సంధ్య తన కొడుకు తీసుకుని హైదరాబాద్కు వెళ్లిపోయింది.