భార్య కాపురానికి వస్తలేదని.. వీడియో తీసుకుని సూసైడ్

వరంగల్ సిటీ, వెలుగు: భార్య కాపురానికి రావడం లేదని ఓ యువకుడు సోమవారం రాత్రి సెల్ఫీ తీసుకుని ఉరేసుకున్నాడు.   వరంగల్ బీఆర్​  కాలనీలోని  రాజీవ్ గృహకల్పలో నివాసముండే దొనికెల సతీశ్​(30),  రాధిక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మనస్పర్థలు రావడంతో సతీశ్​ దంపతులు రెండున్నర సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఎన్నోమార్లు పెద్దమనుషుల ద్వారా రాజీ కుదిర్చిన ఫలితం లేకుండా పోయింది.  

దీంతో మనస్తాపం చెందిన సతీశ్​ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేసే సతీశ్​ తన ఆత్మహత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  తన చావుకు భార్య రాధిక, అత్తతో పాటు బామ్మర్ది కారణంగా చెప్పాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.