పినపాక: కిరాణ సామానులు సదురుతుండగా భర్తకు విద్యుత్ షాక్ కొట్టడంతో భర్తను కాపాడే తరుణంలో భార్యకు కరెంటు షాక్ తో చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పినపాక మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన కోమరం సర్వేష్, సమ్మక్క (26) భార్యాభర్తలు కిరాణ షాపు ఉంది.
ఇవాళ షాప్ లో సామానులు సదురుతుండగా, సర్వేష్ కు కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో భర్త అరవడంతో భార్య సమ్మక్క, భర్తను కాపాడే క్రమంలో మృతురాలికి కూడా కరెంట్ షాక్ కు గురైంది. స్థానికులు మణుగూరు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే సమ్మక్క చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. సర్వేష్ కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.