భర్త వేధింపులతో భార్య సూసైడ్

భర్త వేధింపులతో భార్య సూసైడ్
  • కూతురుని చూడడానికి వస్తూ  యాక్సిడెంట్లో తండ్రి మృతి 
  •  నిజామాబాద్ జిల్లాలో  ఘటన

నిజామాబాద్:  భర్త వేధింపులు భరించలేక భార్య సూసైడ్ చేసుకుంది. కూతురును చూడడానికి వస్తూ  యాక్సిడెంట్లో తండ్రి మృతి చెందాడు.  నవీపేట మండలం అబ్బపూర్ తండా కు చెందిన ప్రకాశ్​, మాలోత్ జ్యోతిలకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మగ పిల్లోడు పుట్టలేదని మరో యువతని ప్రకాశ్ వివాహం చేసుకున్నాడు.

అయితే జ్యోతిని  శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో  ఈనెల 21న  ఆమె విషం తాగింది. ఆమెను నగరంలోని జీజీ హెచ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చేర్పించారు.  జ్యోతిని చూడడానికి ఆమె తండ్రి లక్ష్మణ్  నిన్న రాత్రి టీవీఎస్ చాంప్ పై తన స్వగ్రామం వీరన్నగుట్ట తండా నుంచి వస్తుండగా కల్యాపూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వాహనం  ఢీ కొట్టటడంతో స్పాట్ లోనే చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే హాస్పిటల్​లో జ్యోతి కన్ను మూసింది.