- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఖమ్మం టౌన్, వెలుగు : లివర్ వ్యాధితో బాధపడు తున్న భర్తకు భార్య లివర్ దానం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఏపీజీవీబీ ఉద్యోగి, భార్య లావణ్య ఎల్ఎల్ బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శ్రీను నాలుగు నెలలుగా లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు.
దీంతో భార్య తన లివర్ లో 65 శాతం డొనేట్ చేసేందుకు ఒప్పుకుంది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు గురువారం సర్జరీ చేసి ఆపరేషన్లు సక్సెస్ చేశారు. ప్రస్తుతం దంపతులు కోలుకుంటున్నారు. భార్యాభర్తల బంధానికి అర్థం చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.