
మద్యం మత్తులో ఉన్న భర్తను తండ్రితో కలిసి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా నేరేడువలకు చెందిన ప్రీతికి ఆమె భర్తకు వ్యాపారం విషయంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తాగి ఇంటికి వచ్చిన భర్తను తన తండ్రి సహయంతో ముఖంపై దిండుతో నొక్కి చంపేసింది ప్రీతి. తన భర్త గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా హత్యగా తేల్చారు. పోలీసులు ప్రీతిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన భర్తను తానే చంపినట్లుగా ఒప్పుకుంది.