బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీలో విషాదం జరిగింది. భార్య పెట్టిన చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్లో పేర్కొన్న పీటర్ గొల్లపల్లి అనే వ్యక్తి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తెలుగు కుటుంబానికి చెందిన పీటర్ గొల్లపల్లి కుటుంబంతో సహా హుబ్లీకి వెళ్లి స్థిరపడ్డాడు. హుబ్బళిలోని చాముండేశ్వరి నగర్లో పీటర్ గొల్లపల్లి నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫెబ్బే గొల్లపల్లి అలియాస్ పింకీతో రెండేళ్ల క్రితం పీటర్కు వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని నెలలు ఈ జంట అన్యోన్యంగానే ఉంది. ఇటీవల కాలంలో పీటర్కు, పింకీకి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
ఈ గొడవలు తారా స్థాయికి చేరాయి. ఏడు నెలల క్రితం ఇద్దరూ విడిపోయారు. పింకీ భర్తను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులకు కూడా అప్లై చేసింది. భరణం కింద 20 లక్షలు ఇవ్వాలని పింకీ, ఆమె కుటుంబం పీటర్పై ఒత్తిడి పెంచారు. నిత్యం పీటర్కు కాల్స్ చేసి పింకీ, ఆమె కుటుంబం 20 లక్షలు డిమాండ్ చేస్తూ వేధించారు. ఆఫీస్లో ఉన్న సమయంలో కూడా తరచుగా కాల్స్ రావడంతో మేనేజ్మెంట్ పీటర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫీస్ మీటింగ్లో ఉండగా భార్యతో ఫోన్ కాల్లో పీటర్ గొడవపడటంతో మేనేజ్మెంట్ ఆగ్రహం కారణంగా ఉద్యోగం కూడా పోయింది. ఈ పరిణామాల కారణంగా పీటర్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.
ALSO READ | హమ్మయ్యా.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబ్ లేదు: బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు కంప్లీట్
పెళ్లి చేసుకోకుండా ఉన్నా ప్రశాంతంగా ఉండేవాడినని పీటర్ తన కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడిన సందర్భాలున్నాయని పీటర్ తండ్రి ఓబయ్య తెలిపాడు. భార్య టార్చర్ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన పీటర్ చావే శరణ్యమని భావించి క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆదివారం(జనవరి 26, 2025) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పీటర్ కుటుంబం ఆదివారం కావడంతో చర్చ్కు వెళ్లింది. మధ్యాహ్నం 12.30కు చర్చ్ నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి పీటర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. పీటర్ ఉరేసుకున్న గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ లేఖలో పీటర్ ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నందుకు తన తండ్రిని క్షమాపణ కోరాడు. తన భార్యే తనను చంపేసిందని, తన చావును ఆమె కోరుకుందని.. తన భార్య పింకీ టార్చర్ కారణంగానే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్లో రాసి ఉంది. శవపేటిక మీద కూడా భార్య నరకం చూపించడం వల్లే పీటర్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు రాయించారు.
A man, identified as #PeterGollapalli, died by suicide at his residence in #ChamundeshwariNagar, #Hubballi, #Karnataka, reportedly unable to endure harassment from his wife, #FeebheGollapalli alias #Pinky. The incident occurred under the jurisdiction of the #AshokNagar Police… pic.twitter.com/izV7mPsEIe
— Hate Detector 🔍 (@HateDetectors) January 27, 2025