మద్యం మత్తులో గొడవ, భర్తను చంపిన భార్య

మద్యం మత్తులో గొడవ, భర్తను చంపిన భార్య
  • నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలంలో దారుణం 

లింగాల, వెలుగు : మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆగ్రహానికి గురైన భార్య రోకలిబండతో మోది భర్తను హత్య చేసింది. ఈ ఘటన నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నంపల్లి గ్రామానికి చెందిన మేకల రాములు (41) ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ మద్యం మత్తులో తరచూ గొడవపడేవారు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఎల్లమ్మ.. రాములు నిద్రపోయిన తర్వాత రోకలిబండతో కొట్టి, పక్కనే ఉన్న గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ రాములు అక్కడికక్కడే చనిపోయాడు. సోమవారం ఉదయం రాములు సోదరి ఇంటికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో రాములు పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతుడి తల్లి మాసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు లింగాల ఎస్సై నాగరాజు తెలిపారు.