రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే ఓ భార్య కత్తితో పొడిచి కడతేర్చింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని P&Tకాలనీ మేపల్ టౌన్‌లో డాక్టర్ సబీనా రోషన్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి విశాల్ దివాన్ నివసిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. సబీనా భర్త విశాల్‌ను కత్తితో పొడిచి చంపింది. కత్తి పోట్లకు విశాల్ అరవడంతో.. స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసే సరికి విశాల్ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. డాక్టర్ సబీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విశాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
For More News..