పెళ్లైందని చెప్పకుండా తనను మోసం పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు బిడ్డతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. లావణ్య అనే మహిళ సరూర్ నగర్ లోని PNT కాలనీలో నివాసం ఉంటుంది. తన భర్త మధుబాబు నారాయణగూడలో స్పీచ్ థెరపీ చేస్తుంటాడని, అతనికి గతంలో పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉండగా తన భార్య చనిపోవడంతో భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది ఆ విషయం తనకు చెప్పకుండా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ లావణ్య ఆరోపించింది.
నారాయణగూడలో స్పీచ్ థెరపీ చేస్తుండగా తనకు మధుబాబు పరిచయం అయ్యాడని.. అది ప్రేమగా మారడంతో 2022లో తనను వివాహం చేసుకున్నాడని లావణ్య మీడియాకు తెలిపింది. తనకు పెళ్లి చేసుకున్న 5 నెలల తర్వాత తనకు పెళ్లయిందని,ఇంటర్ చదువుతున్న పిల్లలున్నారని మధుబాబు చెప్పాడని వెల్లడించింది.
అయితే తమకు ఓ పాప జన్మించిందని ఇప్పడు తమను మధుబాబు పట్టించుకోవడం లేదంటూ తన భర్త ఇంటి ముందు లావణ్య ఆందోళనకు దిగింది. అయితే తమ ఇంటి మందు మహిళ ఆందోళనకు దిగిందంటూ మధుబాబు మొదటి భార్య, పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.