తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కంట తడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త ప్రమేయం లేకుండా జరిగిన ఘటనకు అతన్ని బాధ్యుణ్ణి చేయడం సరైనదని కాదన్నది ఆమె అభిప్రాయం.
ALSO READ : అల్లు అర్జున్ కేసు: కోర్టులో హోరాహోరీ వాదనలు.. అయినా రాని బెయిల్.. రిమాండ్ తప్పలేదు..
ప్రస్తుతం అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, కూతురు అర్హ, కొడుకు అయాన్ జూబ్లీహిల్స్‍లోని తమ ఇంట్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసి సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా వారింటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి దంపతులు, నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని.. స్నేహరెడ్డిని, ఆమె పిల్లలను ఓదార్చారు.