
జనాలకు సోషల్ మీడియా పిచ్చి ముదిరింది. ప్రతి దాన్ని వీడియో తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జనాలకు అలవాటు గా మారింది. తాజాగా ఓ కపుల్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైటెక్ యుగంలో జనాలా బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఆఫీసులో ఒత్తిడితో పని చేస్తూ.. ట్రాఫిక్ సమస్యతో అలసిపోయి ఇంటికి చేరతారు. అలా వచ్చిన భర్తకు .. అతని భార్య గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. ఇక అంతే ఆయనలో అలసట.. ఒత్తిడి అంతా మాయమైంది. ఆఫీసులో చాలా అలసిపోయి ఇంటికి చేరుకున్న భర్తకు కుషీ చేసేందుకు ఆ ఇంటి ఇల్లాలు సూపర్ ప్లాన్ వేసింది.. వేయడమే కాదు. అది వర్కవుట్ అయింది .
— Baba Einstein (@BabaEinsteinJi) February 17, 2025
ఈ వైరల్ వీడియోను '@BabaEinsteinJi' అనే యూజర్ సోషల్లో మీడియా షేర్ చేశారు. ఓ వ్యక్తి ఆఫీసు నుంచి నీరసంగా.. బ్యాగ్‌ను భుజంపై వేసుకొని ఊసురోమంటూ ఇంటికి వస్తాడు..అప్పటికే అందంగా తయారైన భార్య అతను ఇంట్లో అడుగు పెట్టగానే డ్యాన్స్చేసింది. ఇక అంతే ఒక్క క్షణం ఆలోచించి భర్త ఆనందంతో ఉక్కిరి బిక్కిరయి ఆయన కూడా భార్యతో కలిసి స్టెప్పేశాడు. ఈ వీడియో కేవలం నాలుగు రోజుల్లో 7.8 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఆఫీసు నుంచి ఇంటికి రావడంతో సంతోషంగా ఉండాలి.. కుటుంబసభ్యులు ఆనందంగా స్వాగతం పలకాలంటూ ఈ జంట పరిపూర్ణమైన జంట అని రాశారు. మరొకరు డ్యాన్స్ చేయడం రాకపోయినా.. ఎలా ఆనందించాలో తెలుసుకోండి అని కామెంట్ చేశారు.
ఏది ఏమైనా ఏవేవో గొడవలు.. పని ఒత్తడి.. అలసట..నీరసం.. బాస్ తిట్లతో ఇంటికి చేరుకున్న వారికి ఇంట్లో కాస్త కుషీగా ఉండే వాతావరణం కలిగిస్తే ఆ ఆనందమే వేరుగా మరి..!