భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు ఇవ్వలేం... ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు

భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు ఇవ్వలేం... ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు

చెన్నై: భార్య పోర్న్ వీడియోలు చూస్తున్నదనే కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాసు హైకోర్టు వెల్లడించింది. పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని..హస్తప్రయోగం చేసుకునే హక్కు వారికీ ఉంటుందని తేల్చిచెప్పింది. తన భార్య పోర్న్ వీడియోలను చూస్తూ హస్తప్రయోగానికి బానిసైందని..తనకు విడాకులు ఇప్పించాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ అభ్యర్థనను కింది కోర్టు తిరస్కరించగా.. అతడు  మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి అప్పీల్‌ను జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమ బెంచ్ బుధవారం విచారించింది. 

ఈ సందర్భంగా  అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. "స్వీయ ఆనందాన్ని హరించడం సరైనది కాదు. పురుషుల్లో హస్తప్రయోగం సరైనదే అయితే స్త్రీలకు కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది. పోర్న్ వీడియోలకు బానిసగా మారడం కచ్చితంగా చెడ్డ అలవాటే. దీనిని నైతికంగా సమర్దించలేం. కానీ, ఈ కారణంతో విడాకులు మంజూరు చేయమనడం కరెక్ట్ కాదు. 

అంతేగా, భార్య తన జీవిత భాగస్వామిని బలవంతం చేయకుండా  పోర్న్ చూడడాన్ని వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేం. పోర్న్ చూసే వ్యక్తి జీవిత భాగస్వామిని తనతో చేరమని బలవంతం చేస్తేనే అది క్రూరత్వం అవుతుంది" అని ధర్మాసనం పేర్కొంది. విడాకుల పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.