వైఫై విషయంలో గొడవ.. ఒకరు మృతి

వైఫై విషయంలో గొడవ.. ఒకరు మృతి
  • కరీంనగర్ సిటీలో ఘటన 

కరీంనగర్ క్రైం, వెలుగు: వైఫై విషయంలో  ఇద్దరు వర్కర్ల  మధ్య జరిగిన గొడవలో ఒకరి మృతిచెందిన ఘటన  కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్‌‌ సిటీ కిసాన్‌నగర్‌‌ లోని   ఫాస్ట్ పుడ్ సెంటర్ లో  బహదుర్ రాజు, బహదుర్ జగదీశ్ ​వర్కర్లుగా  చేస్తున్నారు. వైఫై విషయం లో బుధవారం వీరి మధ్య గొడవ జరిగింది. 

జగదీశ్ తన అన్నలు బహదుర్ శంకర్, భరత్, దీపక్, కృష్ణను వెంటబెట్టుకుని అదేరోజు షాపు వద్దకు వెళ్లారు. రాజుతో పాటు అతని తండ్రి బహదుర్ భగత్(40), తమ్ముడు ఆకాశ్‌ కండ్లలో కారం పొడి కొట్టి కర్రలతో దాడికి పాల్పడ్డారు. భగత్ తలకు తీవ్రగాయం కాగా  హాస్పిటల్‌కు తరలించగా  చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీటౌన్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు.