అడవి జంతువుల ముఠా గుట్టు రట్టు

కుమురంభీం జిల్లా: అడవుల్లో రహస్యంగా వన్య ప్రాణులను వేటాడి.. అంతే రహస్యంగా జనానికి అమ్మి భారీగా సొమ్ము చేసుకునే వేట గాళ్ల ముఠాను కుమురంభీమ్ జిల్లా అటవీశాఖ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌ సమీపంలో అలుగు అనే జంతువును వేటాడి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు 10 మంది ముఠా సభ్యులను ఫారెస్ట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అడవుల్లో వన్యప్రాణులను వేటాడే వేట గాళ్లతోపాటు వాటిని అడవిలో నుండి బయటకు తీసుకొచ్చి రహస్యంగా జనాలకు అమ్మే ముఠా సభ్యులు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. నిందితులను అదిలాబాద్ ఫారెస్ట్ కన్జర్వేటర్ వినోద్ కుమార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.