అడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి

అడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి

• మరొకరికి గాయాలు

మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: అడవి పంది దాడిలో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి గ్రామా నికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరో రైతు గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్యాల శంకరయ్య (59) అనే రైతు బుధవారం గ్రామ శివారులోని పొలం వద్ద పని చేస్తుండగా స మీపంలోని పొదల్లో నుంచివచ్చిన అడవి పంది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. శంకరయ్య భయపడి కేకలు వేయగా సమీప పొలాల్లో ఉన్న రైతులు పరిగెత్తుకొచ్చి పందినివెళ్లగొట్టారు.

అది అక్కడి నుంచి పరిగెత్తి కొద్ది దూరంలో మరో పొలంలో పనిచేస్తున్న బేగరి బిక్షపతి(40)పై దాడి చేయడంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ శంకరయ్యను స్థానికులు ట్రీట్ మెంట్ కోసం అంబులెన్స్లో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. స్వల్ప గాయాలైన బేగరి బిక్షపతిని సిరిపురం పీహెచ్ సీలో అడ్మిట్ చేశారు. నర్సాపూర్ ప్రభుత్వ అను పత్రిలో చికిత్స పొందుతూ శంకరయ్య మృతి చెందాడు.