బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) వాడి వేడిగా జరుగుతోంది. బిగ్బాస్ హౌస్లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. ఈసారి లిమిటే లేకుండా.. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్కు హామీ ఇచ్చేసిన.. ట్విస్టులు కూడా అదే లెవల్లో ఇస్తూ వస్తున్నాడు. ఏడో వారం నాగ మణికంఠ (Naga Manikanta) ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోయాడు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ఎలిమినేషన్ ఎలా జరిగింది. ఇక ఈ బిగ్‌బాస్ సీజన్ 8 ఎనిమిదో వారంలో ఎవరెలా ఆడారు అనే వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే ఏడు వారాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ బిగ్బాస్ షో ఎనిమిదో వారం చేరుకుంది. ఎనిమిదో వారం ఎవరు ఊహించని విధంగా వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ (Mehboob) ఎలిమినేట్ అయ్యాడు. 8వ వారం ఎలిమినేషన్లు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అత్యధిక ఓట్లతో ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో ఉంటే నిఖిల్ రెండో స్థానం, విష్ణుప్రియ మూడో ప్లేసులో నిలిచింది. ఇక నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటే.. ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని పావని ఉన్నారు.
అయితే.. ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. అంతేకాదు తనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయని.. అందుకు డేంజర్ జోన్లో కూడా తనే ఉందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి.. మెహబూబ్ను నాగార్జున ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. దీంతో ఆదివారం (2024 అక్టోబర్ 27న) హౌజ్ నుంచి మెహబూబ్ వెళ్లిపోయారు. అతి తక్కువ ఓటింగ్ కారణంగా బిగ్ బాస్ 8 తెలుగు 8వ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు.
కేవలం మూడు వారాలు మాత్రమే హౌజ్‌లో ఉన్న మెహబూబ్.. తన బిగ్‌బాస్ జర్నీతో పాటు ఎలిమినేట్ కావడానికి కారణాలపై బిగ్‌బాస్ బజ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో స్టేజ్ మీద మెహబూబ్ మాట్లాడుతూ.. 'గత సీజన్ లో కూడా దీపావళి సమయంలోనే ఎలిమినేట్ అయ్యాననీ, ఇప్పుడు కూడా అదే పండగ వేళ ఎలిమినేట్ అయ్యాననీ ఫీల్ అయ్యారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు. తాను ప్రతి టాస్క్‌లోనూ బెస్ట్ ఇచ్చాననీ, కానీ, దురదృష్టవశాత్తూ బయటకు వచ్చానంటూ ఎమోషనల్ అయ్యారు మెహబూబ్.
ALSO READ : Pushpa2TheRule: ప్రతీ 10 నిమిషాలకో హై.. నాగార్జునతో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అనసూయ
అయితే.. వైల్డ్ కార్డు ద్వారా అక్టోబర్ 6న ఏంట్రీ ఇచ్చిన మెహబూబ్.. మూడు వారాలు మాత్రమే హౌజ్‌లో ఉన్నందుకు మంచిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకోగా.. ఈ లెక్కన 3 వారాలకు గాను రూ. 15 లక్షల రూపాయలు సంపాదించాడని తెలుస్తోంది.
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఢీ డ్యాన్సర్ నైనిక, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వెళ్లారు. 7వ వారంలో నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. లేటెస్ట్ వీక్ లో మెహబూబ్ హౌస్ నుంచి బయటికొచ్చారు. మరి నెక్స్ట్ ఎవరో చూడాలి.