అడవి కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

వెలుగు, కోటపల్లి: కోటపల్లి మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో గురువారం అడవి కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి చనిపోయింది. అడవి కుక్కలు దాడి చేస్తుండడంతో అడవిలో నుంచి ఓ చుక్కల దుప్పిపై గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. గమనించిన స్థానికులు ఆ కుక్కలను తరిమి విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. మండలంలోని పశువైద్యాధికారికి సమాచారం అందించగా ఆయన చికిత్స ప్రారంభించేలోపే చనిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు పంచనామా నిర్వహించి గ్రామ సమీపంలో ఖననం చేశారు.