ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న పుష్ప 2:ది రూల్ (Pushpa 2 The Rule) డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ బోర్డ్ పుష్ప2 సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. పుష్ప 2 రన్ టైమ్ 3:20 గంటలు ఉండబోతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ పుష్ప 2:ది రూల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ తాను నటిస్తూ సెట్ లో ఎంత కష్టపడ్డాడో.. ఒక్కో సీన్ కి అల్లు అర్జున్ ఎలా తనని తాను మార్చుకున్నాడో వీడియో చూస్తే అర్ధమవుతోంది. ఒక్కో షాటు ఒక్కో విజువల్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్ లో అమ్మవారి అవతారంలో మాస్ జాతర చేశారు అల్లు అర్జున్. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూ.. మేకింగ్ వీడియో అరాచకంగా ఉందని, ఇది అల్లు అర్జున్ మాస్ జాతర అని, ఇది పుష్పాగాడి ఆగమనం అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్.
Also Read : వెంకీ, ఐశ్వర్యల రోమాంటిక్ మెలోడీ అదిరిపోయింది
అయితే, పుష్ప 2 మూవీ విడుదలకి ముందే పలు విధాలుగా కోట్లు కొల్లగొడుతోంది. క్షణ క్షణానికి ఈ లెక్కలో భారీ మార్పు వస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెసే వెయ్యి కోట్ల రేంజ్ లో ఉందంటే.. పుష్ప మ్యానియా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జస్ట్ పాజిటీవ్ టాక్ వచ్చిందంటే చాలు.. రికార్డ్స్ లెవల్లో వసూళ్లు రావడం గ్యారంటీ.
దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.