లింగాల, వెలుగు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని పీసీసీఎఫ్ ( ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ) రాకేష్ మోహన్ దోబ్రియల్ అన్నారు. శనివారం లింగాల మండల పరిధిలోని పద్మనపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో ఫారెస్ట్ వాచ్ టవర్‌ను ప్రారంభించారు.
అడవులు మానవ మనుగడకు ఎంతో అవసరమన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించరాదన్నారు. జంతువులను చంపితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, ఎఫ్‌డీఓ తిరుమల రావు, శ్రీనివాస్, లింగాల ఫారెస్టు రేంజర్ వీరేశ్, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.