తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. రెండు డోసులు తీసుకోని వారిని లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని దక్షిణ రైల్వే వివరించింది. ఈ నిబంధనలో ఎలాంటి సడలింపులు ఉండబోవని, సీజన్ టికెట్ తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు మొబైల్ ఫోన్లలో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) అందుబాటులో ఉండదని కూడా చెప్పింది.
మరిన్ని వార్తల కోసం..