కరీంనగర్ సిటీలో నైట్ ఫుడ్ కోర్ట్స్ : మేయర్​యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​సిటీలో హైదరాబాద్ తరహా నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మేయర్​యాదగిరి సునీల్ రావు వెల్లడించారు. వీటిని శాతవాహన యూనివర్సిటీ ఏరియాలో నెలలోపు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం విద్యానగర్ లోని వర్సిటీ ఏరియాలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసే స్థలాన్ని కమిషనర్ ఇస్లావత్ తో కలిసి మేయర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో మౌలిక వసతులు కల్పించి, అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం 35వ డివిజన్ లో రూ.30లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.