సల్మాన్ ఖాన్ కు మరోసారి బాంబు బెదిరింపులు.. బాంబుతో కారును పేల్చేస్తామంటూ వాట్సాప్ మెసేజ్..

సల్మాన్ ఖాన్ కు మరోసారి బాంబు బెదిరింపులు.. బాంబుతో కారును పేల్చేస్తామంటూ వాట్సాప్ మెసేజ్..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సల్మాన్ ఖాన్ కారును బాంబుతో పేల్చేస్తామంటూ ముంబై వర్లీలోని రవాణాశాఖ కార్యాలయానికి వాట్సాప్ మెసేజ్ చేశాడు ఆగంతకుడు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేస్తామని.. బాంబు పెట్టి కారును పేల్చేస్తామంటూ వాట్సాప్ మెసేజ్ పంపాడు ఆగంతకుడు. ఈ బెదిరింపు మెసేజ్ తో అప్రమత్తమయ్యారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వర్లీ పోలీసులు. బాంబు బెదిరింపులు ఆకతాయి చర్య లేక సల్మాన్ కు నిజంగా థ్రెట్ ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బాంబు బెదిరింపుల ఘటనను సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. కాగా.. సల్మాన్ ఖాన్ కు బాంబు బెదిరింపులు రావడం ఇది కొత్తేమీ కాదు. మహారాష్ట్రలో  ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ను  చంపుతామంటూ రోజుకొకరు  వార్నింగ్ ఇస్తున్నారు. 

ఆ తర్వాత మరో బాంబు బెదిరింపు కాల్ ఘటనలో నోయిడాకు చెందిన 20 ఏళ్ల  వ్యక్తి. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.  బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కు కూడా ఇదే యువకుడి నుంచి  బెదిరింపు కాల్  వచ్చింది. అయితే డబ్బుకోసమే బెదించారంటూ తేల్చారు పోలీసులు.