సొంత ఖర్చులతో టాయిలెట్లు కట్టిస్తా: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సొంత ఖర్చులతో టాయిలెట్లు కట్టిస్తా: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్​నగర్ పరిధిలోని కొందుర్గ్​సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు పట్టుదలతో చదవాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. మరోవైపు, తన సొంత ఖర్చుతో హాస్టల్లో 15 రోజుల్లో టాయిలెట్లు, బెంచీల ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.