ట్రిపుల్​ ఆర్ అలైన్​మెంట్ మార్పిస్తా : కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్ ​

యాదాద్రి, వెలుగు : భువనగిరి డివిజన్​ మీదుగా వెళ్తున్న ట్రిపుల్​ఆర్​ అలైన్​మెంట్​ను మార్పించడానికి చర్యలు తీసుకుంటానని కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్రకటించారు. యాదాద్రి జిల్లా భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి మద్దతుగా శుక్రవారం నిర్వహించిన రోడ్​ షోలో మంత్రి అనురాగ్​ ఠాకూర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్​ అలైన్​మెంట్​ కారణంగా రైతులు నష్టపోతున్న విషయాన్ని నారాయణ రెడ్డి మంత్రి దృష్టికి తేగా పై విధంగా స్పందించారు.

కేసీఆర్​ గీసిన కాళేశ్వరం డిజైన్​ కారణంగా ప్రాజెక్ట్​ ఫెయిలైందన్నారు. మేడిగడ్డ కుంగిన విషయాన్ని ప్రస్తావించారు. పదేండ్లలో కేసీఆర్​కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ఇచ్చిన హామీ ప్రకారం బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు.