
- హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ
- ప్రచారం ముమ్మరం చేసిన ఫిరోజ్‌ఖాన్
- పూర్వవైభవానికి కాంగ్రెస్ ప్రయత్నాలు
హైదరాబాద్ లోక్ సభ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఈ సెగ్మెంట్ పై దశాబ్దాలుగా ఎంఐఎం జెండా ఎగురుతూనే ఉంది. కానీ,ఈ స్థానంలో ఆరంభం నుంచి కాంగ్రెస్ నుంచి ఓటు బ్యాంకు ఉండేది. ఈ నేపథ్యంలో పూర్వవైభవాన్ని తిరిగి పొందేందుకు ఈసారి ఎన్నికలలో కాం గ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ సన్నద్ధమవుతున్నారు. ఎంఐఎం చీఫ్, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ రాజకీయ ఆరంగ్రేట్రం నుంచి నేటి వరకు ఈ సీటు ఎంఐఎంకే దక్కుతోంది. అయితే, ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పాగా వేయాలని ఆపార్టీ భావిస్తోంది.
ఫిరోజ్ ఖాన్ కు అవకాశం
ఈ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీలో నిలిపేందుకు తొలుత కొందరి పేర్లు పరిశీలించినా అధిష్టానం చివరగా ఫిరోజ్ ఖాన్ కు అవకాశం ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి బరిలో నిలిచిన ఫిరోజ్ ఖాన్ స్వల్ప ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి హైదరాబాద్ ఎంపీ స్థానానికి అదే సామాజిక వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్ ను బరిలో నిలిపింది. వాస్తవానికి నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా మూడుస్లార్లు పోటీలోఉన్న ఫిరోజ్ ఖాన్ ను కూడా తక్కువ అంచనా వేయవద్దని మజ్లిస్ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీలో రాజకీయ అరంగ్రేటం చేసిన ఫిరోజ్ ఖాన్ ప్రజారాజ్యం పార్టీ, ఆపై కాం గ్రెస్ తరఫున పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాం పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి స్వయంగా ప్రచారానికి రావడం గమనార్హం. ఫిరోజ్ ఖాన్ నామినేషన్ వేసిన వెంటనే తన సెగ్మెంట్లో ప్రచారం ముమ్మరం చేశారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని నేతలు,నాయకులతో ప్రత్యకంగా సమావేశం నిర్వహించారు. తన గెలుపునకు కృషి చేసి ఈ స్థా నంలో పార్టీ పూర్వ వైభవానికి పాటుపడాలని వారిని కోరినట్లు తెలిసిం ది. ఇప్పటికే రెండు రోజులుగాప్రచారంపై ప్రత్యేక దృష్టి సారిం చిన ఫిరోజ్ ఖాన్ బహిరంగ సభలు, సమావేశాల ద్వారా మజ్లిస్ పార్టీని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.ఈసారి కాం గ్రెస్ వ్యూహం పనిచేస్తుందో లేదో చూడాలి.
మైనార్టీల ఓటు బ్యాంకుపై గురి
బలమైన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ను కాంగ్రెస్ బరిలోనిలిపింది. ముఖ్యంగా ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటర్లే అధికంగా ఉండడం ఎంఐఎంకు కలిసివస్తున్న అంశం. ఈ క్రమంలో ఎలాగైనా ముస్లిం ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకుంటే గెలుపు సులభమవుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.