రామగుండం నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేస్తా : కందుల సంధ్యారాణి

  • పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్​ నా కాళ్లు పట్టుకున్నడు: సంధ్యారాణి
  • ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కంటతడి

గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియా సమక్షంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్​చేస్తున్నట్టు ప్రకటించి లెటర్​ను పార్టీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర  అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. 

నియోజకవర్గంలో కొంత మంది రాజకీయ నాయకులు తన ఎదుగుదలను చూడలేకపోతున్నారని విమర్శించారు. 30 ఏండ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. రాజకీయంగా తనను అణగదొక్కడానికి కౌశిక హరి, మక్కాన్ సింగ్, కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కోరుకంటి చందర్ తన కాళ్లు పట్టుకొని బతిమిలాడితే చందాలు వేసుకుని గెలిపించామన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గెలుపులో కూడా తన కృషి ఎంతో ఉందన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ల పై కేసులు పెట్టి వేధిస్తున్నారని కంటతడి పెట్టారు. ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.