బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటా : కొనపురి కవిత

భువనగిరి నుంచి  బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని కొనపురి కవిత  వెల్లడించారు.  మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుని కుటుంబం నుంచి రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో  ఉంటానని తెలిపారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ముఖ్య అనుచరులతో ఆమె ఇవాళ  సమావేశమయ్యారు.  

ఈ సందర్భంగా  కొనపురి కవిత మాట్లాడుతూ..  ప్రజలు నుండి ఒక బీసీ అభ్యర్థి రావాలన్న నినాదంతో పోటీలో ఉండాలని అనుకున్నట్లుగా తెలిపారు.   దశాబ్ద కాలం నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన  వారు  మాత్రమే భువనగిరిని ఏలుతున్నారు  కాబట్టి ఒక ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చిన తమను ప్రజలు ఎమ్మెల్యే గా పోటీ చేయాలని కోరుకుంటున్నారని కవిత చెప్పారు.  ఈ క్రమంలో బీఆర్ఎస్  రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని కవిత చెప్పుకొచ్చారు.  

ALSO READ :- హమాస్ కమాండర్ను హతమార్చాం: ఇజ్రాయెల్ సైన్యం