డీలిమిటేషన్ వల్ల.. ప్రమాదంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి: తమిళనాడు సీఎం స్టాలిన్

డీలిమిటేషన్ వల్ల.. ప్రమాదంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి: తమిళనాడు సీఎం స్టాలిన్

చెన్నై: డీలిమిటేషన్ వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాటమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని డీలిమిటేషన్పై చెన్నైలో జరిగిన ఆల్​పార్టీ మీటింగ్లో స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో పార్టీలు ప్రతిపాదించాయి.

డీలిమిటేషన్ కారణంగా సొంతదేశంలో రాజకీయ అధికారం కోల్పోయే అవకాశం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ప్రాతినిధ్యం తగ్గితే నిధుల కోసం నిరంతరం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యత ఉండదని స్టాలిన్ చెప్పుకొచ్చారు.

Also Read : డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ

ఇక.. ఇదే సమావేశంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, పాపులేషన్పై సౌత్ స్టేట్స్ బాధ్యతగా వ్యవహరించాయని చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై న్యాయ నిపుణుల కమిటీని నియమించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని స్టాలిన్ చెప్పారు.

ఈ డీమిలిటేషన్ వల్ల మహిళలకు అధికారం ఎప్పటికీ దక్కదని, విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని, రైతులకు అన్యాయం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. వైసీపీ అధినేత జగన్ డీలిమిటేషన్ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, కేరళ నుంచి సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు.