బెయిలొచ్చిన కేజ్రీవాల్ బయటకు వస్తారా రారా..

బెయిలొచ్చిన కేజ్రీవాల్ బయటకు వస్తారా రారా..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.అయితే, బెయిల్ వచ్చినా కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆయనపై ఉన్న ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండటమే ఇందుకు కారణం.ఈ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ 90రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు.సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ కేసుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో కేజ్రీవాల్ జైలు నుండి బయటకు రావటం అసాధ్యమనే చెప్పాలి.

కాగా,ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీమ్, కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అంశంలో పలు అంశాలపై సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని తెలిపింది.అరెస్ట్ అక్రమమంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీల చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.