ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

కామేపల్లి, వెలుగు: సహకార రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. రూ.31.58 లక్షల నాబార్డ్  స్పెషల్  రీఫైనాన్స్ ఫండ్స్​తో నిర్మించిన కొండాయిగూడెం సహకార పరపతి సంఘం బిల్డింగ్, గోదామ్​ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కోరా  నాగభూషణం, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ విజయ కుమారి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు,  రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

ఎక్స్ గ్రేషియా చెక్కుల అందజేత

ఖమ్మం టౌన్: నయాబజార్ లో మున్సిపల్ వాటర్ టాంక్ శుభ్రం చేస్తూ చనిపోయిన చిర్రా సందీప్ తో పాటు డీఆర్ఎఫ్ టీ సభ్యులు పడిగాల వెంకటేశ్, బాశెట్టి ప్రదీప్  కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా చెక్కులను మంత్రి అందించారు. కుటుంబంలో ఒకరికి ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్  ఆదర్శ్​ సురభిని ఆదేశించారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.

చేకూరి కాశయ్య విగ్రహావిష్కరణ

నిజాయితీ కలిగిన రాజనీతిజ్ఞుడు చేకూరి కాశయ్య అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన చేకూరి కాశయ్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా చేకూరి కాశయ్య నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు. విత్తన గిడ్డంగి సంస్థ చైర్మన్  కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్  కూరకుల నాగభూషణం పాల్గొన్నారు.

మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యం

వైరా, వెలుగు: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మండలంలోని ముసలిమడుగులో నర్వనేని  సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్  సంస్థలకు కట్టబెట్టి  ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. డబ్బుతో లీడర్లను కొనేందుకు ప్రయత్నిస్తుందని, డబ్బుకు లొంగని వారిని ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీలో చేరారని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు  కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు. సీఎం కేసీఆర్​ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. బొంతు రాంబాబు, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, భుక్యా వీరభద్రం, తోట నాగేశ్వరరావు, సుంకర సుధాకర్,​ నర్వనేని వెంకట్రావు, శ్రీనివాస్, సుధాకర్​ పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

సత్తుపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. తన జన్మదినం సందర్భంగా మండలంలోని రేజర్ల  హైస్కూల్ లో పదో తరగతిలో అత్యుత్తమ జీపీఏ సాధించిన స్టూడెంట్స్​కు నగదు బహుమతులు అందజేశారు. రూ.10 వేల విలువైన నోట్ బుక్స్, స్పోర్ట్స్ మెటీరియల్ ను భీమిరెడ్డి గోపాల్ రెడ్డి అందించారు. స్కూల్ డెవలప్​మెంట్​ కోసం గొర్ల వెంకట్ రెడ్డి రూ.10,116 చెక్కును హెచ్ఎం చెన్నకేశవరెడ్డికి అందజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమ మహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపుడి రామారావు, ఎంపీటీసీ విస్సంపల్లి వెంకటేశ్వరావు, సొసైటీ అధ్యక్షుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, గోపాల్ రెడ్డి, చింతల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

రెండో రోజు సీపీఎం దీక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో కరకట్ట ఎత్తును పెంచాలని ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్లతో సీపీఎం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. టీఎన్జీవోస్​ నాయకులు డెక్కా నర్సింహారావు, బీసీ వెల్ఫేర్​ సంక్షేమ సంఘం నాయకులు గద్దల నరసింహారావు, చారుగుళ్ల శ్రీనివాస్​, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు దీక్షలను ప్రారంభించారు. ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల లీడర్లు సంఘీభావం పలికాయి. భద్రాచలాన్ని కాపాడాల్సిన బాధ్యత టీఆర్​ఎస్​ సర్కారుపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్​ అన్నారు.

ఆర్టీఐ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్రు

కూసుమంచి, వెలుగు: ఆర్టీఐ పేరుతో దున్నపోతుల సురేశ్​​మండలంలోని కూసుమంచి, నాయకన్​గూడెం, నర్సింహులగూడెం, జీళ్లచెరువు గ్రామపంచాయితీల్లో ఆర్టీఐ కింద సమాచారం అడిగి సర్పంచులకు ఫోన్​ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్​ ఆరోపించారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు.తాను బెదిరిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచులతో కలిసి సీపీ, కలెక్టర్​లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సర్పంచులు కాసాని సైదులు, చెన్నా మోహన్​రావు, కిషన్​రావు, స్వాతి, నాగేశ్వరరావు, ఎంపీటీసీ జర్పుల బాలాజీ, కందుల వెంకటనారాయణ పాల్గొన్నారు.

ఇండియన్​ పోలీస్​ మెడల్​కు ఎంపికైన డీఎస్పీ

ఇల్లందు, వెలుగు: ఇండియన్​ పోలీస్​ మెడల్​కు ఇల్లందు డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి ఎంపికయ్యారు. 1995 ఎస్సై బ్యాచ్​కు చెందిన రమణమూర్తి ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్​ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఇండియన్​ పోలీస్​ మెడల్​కు ఎంపికైన ఆయనను పలువురు అభినందించారు.  

పేదల సంక్షేమంపై వైట్​ పేపర్​ రిలీజ్​​ చేయాలి

కల్లూరు/పెనుబల్లి, వెలుగు: సంపన్నులు, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన సబ్సిడీలు, రాయితీలు, పేదల సంక్షేమం కోసం చేసిన ఖర్చులపై మోడీ సర్కార్ వైట్​ పేపర్​ విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం ఆజాదీ కా గౌరవ్ యాత్రలో మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ తో కలిసి కల్లూరు మండలం ఖాన్ ఖాన్ పేట నుంచి కల్లూరు క్రాస్ రోడ్, ఆర్కేపురం, టేకులపల్లి మీదుగా పెనుబల్లి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లౌకిక, ప్రజాస్వామిక వాదుల లక్ష్యం కావాలన్నారు. దేశంలో జాతీయవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. పేదలు, సామాన్య, మధ్యతరగతి వర్గాలు బీమా డబ్బులు దాచుకునే ఎల్ఐసీని ప్రైవేటుపరం చేస్తుందని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, లీడర్లు రాజిబాబు, రామిశెట్టి మనోహర్ నాయుడు, రాయల నాగేశ్వరరావు, పొట్లపల్లి వెంకటేశ్వర రావు, వడ్లపూడి కృష్ణయ్య, మేకతొట్టి కాంతయ్య పాల్గొన్నారు.

టేకులపల్లిలో..

టేకులపల్లి: మండలంలోని గోల్యాతండా నుంచి బోడ్​ సెంటర్​ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్​​పోడెం వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్​పరం చేస్తుందని ఆరోపించారు. లీడర్లు లక్కినేని సురేందర్, భుక్యా ధల్సింగ్ నాయక్, మంగీలాల్​నాయక్, డాక్టర్​ జి రవి, మహ్మద్​ఖాన్, రెడ్యానాయక్, గుండా నర్సిం హారావు, ఆకారపు స్వప్న, దేవానాయక్ పాల్గొన్నారు.