- హ్యుందాయ్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్
న్యూఢిల్లీ: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. ఇందుకోసం అవకాశాలను వెతుకుతున్నామని తెలిపింది. ఈ కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. కంపెనీ పాపులర్ మోడల్ క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చే ఏడాది జనవరి–ఏప్రిల్ క్వార్టర్‌లో లాంచ్ అవ్వొచ్చు.
ఎమర్జింగ్ మార్కెట్లకు ప్రొడక్షన్ హబ్‌గా ఎదిగామని, 80 కి పైగా దేశాలకు ఎగుమతులు జరుపుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ అన్నారు . ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఏషియా వంటి ఎమెర్జింగ్ మార్కెట్లకు ఇండియాలో తాము తయారు చేసే కార్లు బాగా సరిపోతాయని పేర్కొన్నారు. ఈవీలను కూడా ఈ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐయోనిక్5 ను రూ.45 లక్షల ధరతో అమ్ముతోంది.
ఈ వారమే హ్యుందాయ్ ఐపీఓ..
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ఈ నెల 15 న ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. ఈ నెల 17 వరకు ఓపెన్‌లో ఉంటుంది. రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరుని రూ. 1,865– 1,960 రేంజ్‌లో అమ్ముతున్నారు. అర్హత ఉన్న ఉద్యోగులు రూ.186 తక్కువకే షేరును కొనుక్కోవచ్చు. ఒక లాట్‌లో ఏడు షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ. రెండు లక్షల వరకు బిడ్స్ వేయొచ్చు.