రైల్వే పోర్టర్ హక్కుల కోసం పోరాడుతా.. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తా: రాహుల్ గాంధీ

రైల్వే పోర్టర్ హక్కుల కోసం పోరాడుతా..  వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తా: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడుతానని కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పోర్టర్లతో మాట్లాడిన వీడియోను రాహుల్ ​బుధవారం తన యూట్యూబ్ చానెల్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఎక్స్​లోనూ పోస్ట్​చేసి.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ తొక్కిసలాటలో ప్రజలకు సహాయం చేయడానికి పోర్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, అయినప్పటికీ వారి సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదని అన్నారు. 

పోర్టర్ల హక్కుల కోసం తన శక్తి మేరకు పోరాడుతానని రాహుల్ ​పేర్కొన్నారు. అలాగే, జనసమూహాల వద్ద భద్రతను బలోపేతం చేయడానికి 'ఆవాజ్ భారత్ కీ' పోర్టల్‌‌‌‌‌‌‌‌పై సూచనలను చేయాలని ఆయన ప్రజలను కోరారు. "మేము భారతదేశం వాయిస్​ను వింటాము!" అని ఆయన పోస్ట్​లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో పెరుగుతున్న తొక్కిసలాటలు చాలా ఆందోళన కలిగించే విషయం అని, ఇలాంటి ఘటనలలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి విషాదాలను ఎలా నివారించాలో 
మనమంతా ఆలోచించాలని ఆయన అన్నారు.