కాకా చూపిన ప్రజాసేవా మార్గంలోనే మేము నడుస్తున్నమ్ : వివేక్ వెంకటస్వామి

కాకా చూపిన ప్రజాసేవా మార్గంలోనే తాము నడుస్తామని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల బూత్ స్థాయి సమావేశం జరిగింది. గ్రామాల్లో మంచినీటి, రోడ్డు, డ్రైనేజీ సిస్టం మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు వివేక్. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. కాంగ్రెస్ ప్రజల కోసమే పని చేస్తోందని అన్నారు పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ. జైపూర్ కు మరో పవర్ ప్లాంట్ తీసుకొస్తామని తెలిపారు వంశీకృష్ణ. ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తనదే అని కూడా హామీ ఇచ్చారు వంశీకృష్ణ. కాన్ కూర్ గ్రామంలో కూడా నిర్వహించే బూత్ స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు ఎమ్మెల్యే  వివేక్, వంశీకృష్ణ.