జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (NTR 31) సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.
ఇటీవలే ఆగస్ట్ 9న NTR 31 పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇక అప్పటినుండి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
The moment we all have been waiting for is here 🤩#NTRNeel begins with an auspicious Pooja Ceremony 🪔 💫
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024
The DUO is all set to create a MONSTROUS HAVOC at the BOX OFFICE ❤️🔥
See you all on his land from 𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔 🔥
Man of Masses @tarak9999… pic.twitter.com/rzNzrsZIcG
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ సరసన కన్నడ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth)ని సెలెక్ట్ చేసాడట డైరెక్టర్ నీల్. ఇందుకోసం నటి రుక్మిణి వసంతతో చర్చలు కూడా జరిపారట. అందుకు ఆమె వెంటనే ఎన్టీఆర్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ బ్యూటీ ఇప్పటికే ‘777 చార్లీ’ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తన సహజ నటనతో, తనదైన ఎమోషన్స్ ను పలికించి అటు కన్నడలో, ఇటు తెలుగులో బాగా గుర్తింపు పొందింది. దీంతో నీల్ ఈ రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న పేరు కూడా వినిపిస్తోంది. కాగా..ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తారక్ ప్రస్తుతం దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆపై ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు.
Also Read :- వరుణ్ తేజ్ పీరియాడిక్ థ్రిల్లర్ మట్కా రిలీజ్ డేట్ అనౌన్స్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరి NTR 31 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి షురూ కానుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఫుల్ మాసివ్ రోల్లో తారక్ కు లుక్, క్యారెక్టరైజేషన్‌ను..దృష్టిలో పెట్టుకొనే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని నీల్ డిసైడ్ అయినట్లు టాక్.