వాషింగ్టన్: బైడెన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదా..? ప్రత్యర్థి డోనాల్డ ట్రంప్ తో జరిగిన అధ్యక్ష డిబేట్ లో బైడెన్ ఎందుకు తడబడ్డాడు..?బైడెన్ అధ్య్అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుం టున్నాడా..? ఒకవేళ బైడెన్ గనక..అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటే.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?.. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీస్తున్న వేళ..అనేక సందేహాలు తలెత్తుతున్న క్రమంలో ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ ఆస్థానాన్ని భర్తీ చేస్తుందా..బైడెన్ కు ప్రత్యామ్నాయం కమలా హరీస్ అన్న న్యూస్ బాగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని బైడెన్ వర్గాలు కూడా నిజమే అన్నట్లు తలూపుతున్నారట.
గత వారం రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబెట్ లో బైడెన్ తడబడటం.. కొన్ని సార్లు అసంబద్దమైన వ్యక్తీకరణ, అతను రెండోసారి అమెరికా అధ్యక్షునిగా సర్వీస్ చేసేందుకు సరిపోలేడనే ఆందోళన డెమోక్రటిక్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. అంతేకాకుండా ఇటీవల న్యూస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలు కూడా బైడెన్ కు ప్రత్యామ్నాయం కమలా హరీస్ అని చెబుతున్నాయి. ఈ సర్వేల్లో ట్రంప్, బైడెన్ కంటే ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారట కమలా హరీస్.
- ALSO READ | UK.. ఇంగ్లాండ్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. అక్కడ ఓటింగ్, కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలుసా..!
ఈ న్యూస్ ఏజెన్సీల సర్వేల్లో అమెరికా నమోదిత ఓటర్లలో 47 శాతం మంది ట్రంప్ కు సపోర్ట్ చేయగా.. 45 శాతం మంది కమలా హారీస్ కు మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ కు వ్యతిరేక మహిళలు కమలా హారీస్ కు సపోర్టు చేస్తే అవకాశాలన్నీ ఆమె వైగ్గు చూపుతాయంటున్నారు. కమలా హారీస్ కు 50 శాతం ఓటర్లు , ట్రంప్ కు 44 శాతం ఓటర్ల మద్దతుందని సర్వేలు చెబుతున్నాయి.
దీంతోపాటు ప్రముఖ క్యాబినెట్ మెంబర్లు కాలిఫోర్నియాకు చెందిన గావిన్ న్యూసోమ్, మిచిగాన్‌కు చెందిన గ్రెట్చెన్ విట్మర్ , పెన్సిల్వేనియాకు చెందిన జోష్ షాపిరో వంటి డెమొక్రాటిక్ గవర్నర్‌లతో సహా కొంతమంది కీలక డెమోక్రాట్లు కూడా బైడెన్ కంటే హరీస్ బెటర్ అని అనుకుంటున్నారట. డెమోక్రాట్లలో హారీస్ కు మంచి పేరు కూడా ఉంది.
అయితే ఈ చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఈ ఊహాగానాలకు దూరంగా హారీస్ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది కీలక డెమోక్రాట్లకు ఆమె ట్రంప్ ను ఓడించగలదనే నమ్మకం లేదట. అంతేకాదు అమెరికా అధ్యక్షునిగా ఎన్నడూ మహిళను ఎన్నుకోలేదని , హారీస్ వైస్ ప్రెసిడెంట్ గా తనను తాను గుర్తించుకోవడానికే పోరాడుతున్నారని విమర్శలూ లేకపోలేదు.